మా పాఠశాలలో స్కూల్‌ రేడియో కార్యక్రమం జరగటం అందరికీ సంతోషకరమైన విషయం. ఈ రేడియో కార్యక్రమం వలన మాలో వున్న భయం పోయింది. నాలో ధైర్యం వచ్చింది. తెలుసుకోవాలనే కోరిక కలిగింది. ఒక మంచి పుస్తకం వంద మంది ఉపాధ్యాయులతో సమానం. ఒక కలెక్టర్‌ అయినా, ఎంఆర్‌ఓ అయినా పుస్తకాలు చదివే అంత పైస్థాయికి ఎదుగుతారు. ఎంత దూరమైనా ఒక అడుగుతోనే ప్రారంభిస్తారు. ఆ మొదటి అడుగే ఈ స్కూల్‌ రేడియో కార్యక్రమం. ఈ రేడియో కార్యక్రమంలో అందరి ముందూ మాట్లాడాలనే ధైర్యం వచ్చేసింది. ఇంతకుముందు అందరిముందు మాట్లాడాలంటే నాలో ఏదో తెలియని భయం. కాని మాట్లాడాలని అనిపించేది. అందరి ముందు మాట్లాడేటప్పుడు కాళ్ళు, చేతులు వణుకుతుండేవి. మరి ఇప్పుడు అందరి ముందు మాట్లాడే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాము. నాలో ఈ భయాన్ని తొలగించి, నాలో తెలుసుకోవాలనే కోరిక, ధైర్యం పెంచింది. పట్టుదల, ఏకాగ్రత, బుద్ధిబలం, దక్షత కలవారినే విజయం వరిస్తుంది అన్నారు వివేకానంద. నాకు తెలియని విషయాలు తెలియజేసింది స్కూల్‌ రేడియో కార్యక్రమం.
....  మేడిశెట్టి వాణి, 5వ తరగతి

Feedback

I like this School Radio programme. This programme develop communication skills among children. I know how to record and edit files on computer. I have enjoyed the programme. I have got so much knowledge about society.

G. Deepthi
IX Std
-----------------------------
In School Radio training programme we all learnt by doing. We did learn a topic, developed content, and practiced it. I have shed my stage fear. Not only me, all of us, shed our stage fear after participating in School Radio.

Rajitha
7 Std
-------------------------
School Radio Training programme was excellent. School Radio team distributed books to children to read and circulate among ourselves. We also learnt about discipline.

Mounika
9 Std 

I am happy to participate in School Radio Training programme, I was fearful to come in front of people and talk. Later, I shed my fear. By participating in this programme, I have received lots of information about many topics. Now, I knew what are the important steps to improve our communication skills.

A. Bharathi
8 Std
-------------------------
It is a great opportunity to participate in School Radio Training programme. Our group has chosen Human Rights as a topic to develop content. We have received a book from School Radio on 'What are Human Rights', Published by Youth for Human Rights. Through this exercise, I have learnt how to behave in the society. (Name not written)
-----------------------------
School Radio is a very good idea. I have learnt how to talk with others. School Radio has created lots of excitement, and I have enjoyed by participating in the programme.

B. Jyothirmai
8 Std 

Through School Radio Training programme, I have learnt that not only observing a process of a task given to us by the team, but need to observe what is going on around us.

S. Indu
VII Std
-----------------------------
School Radio is a wonderful idea. I have learnt a lot by participating in the programme. Hands on learning programme is interesting.

B. Purnima
V Std
-------------------------------
I am so excited and happy to participate in School Radio programme. It increased our listening skills, and our creativity.

Ch Susmitha
VII Std
------------------------------
As children, we need more inspiration and motivation. We certainly get these from School Radio.

Pushpa
VII Std 

  • స్కూల్‌ రేడియో వల్ల నాలో భయం పోయింది, ఆనందం కలిగింది. భవిష్యత్తులో ఈ కార్యక్రమం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటి కాలుష్యం, నీటి విలువ గురించి తెలుసుకున్నాను. .. బి. జానకి, 6వ తరగతి 
  • పర్యావరణం, వాతావరణ కాలుష్యం గురించి తెలుసుకున్నాను. ... ఎం.ధరణి, 6 వ తరగతి 
  • స్కూల్‌ రేడియో క్లబ్‌ నాకు చాలా బాగా నచ్చింది. దీనివలన నాలెడ్జ్‌తో పాటు క్రియేటివిటీ కూడ పెరుగుతుంది. ... టి.దేవిక, 8వ తరగతి 
  • రేడియో కోసం స్క్రిప్ట్‌ ఎలా వ్రాయాలో నేర్చుకున్నాను. రేడియోలో మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చే డిస్ట్రబెన్స్‌ను ఆడాసిటీ సాఫ్ట్‌వేర్‌తో ఎలా తొలగించాలో కూడా నేర్చుకున్నాను. ... భారతి, 8వ తరగతి 
  • స్కూల్‌ రేడియో ప్రోగ్రాం నాకు బాగా నచ్చింది. స్కూల్‌ రేడియోలో మాట్లాడినవన్నీ ప్రపంచంలో ఎవరైనా వినవచ్చు. నా మాటలు ప్రపంచంలో ఎవరైనా వినే అవకాశం నాకు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను మాట్లాడిన మాటలు నా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు వింటే ఎంత సంతోషపడతారో కదా? మాట్లాడుతున్నది మా అమ్మాయేనా? మా అమ్మాయికి ఇంత మంచి అవకాశం ఎప్పుడు వచ్చింది అని చాలా సంతోషంతో ఉప్పొంగిపోతారు. ... కె. కాంత ప్రియ, 9వ తరగతి 
  • మేము స్కూల్‌ రేడియోలో వాతావరణం గురించి, చెట్ల పెంపకం గురించి, నీటి వాడకం, గాలి కాలుష్యం గురించి మాట్లాడాము. తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాము. ... బి.కీర్తి సాయి, 7వ తరగతి 
  • ఆడపిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్ళి చేయాలి అని తెలుసుకున్నాను. ముందుగా పెళ్ళి చేస్తే, జబ్బుతో వున్నవాళ్లు లేదా అంగవైకల్యంతో వున్న పిల్లలు పుడతారు. అంత బాధ మనకు అవసరమా చెప్పండి! పిల్లలు పుట్టిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాను. తర్వాత ఇన్ఫెక్షన్లు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాను. స్కూల్‌ రేడియోకి ధన్యవాదాలు. ... ఎ. ధరణి, 7వ తరగతి 
  • ఇంతకుముందు టీవీలో, రేడియోలో మాట్లాడాలని నాకు అనిపించేది. ఆ కోరిక ఇపుడు స్కూల్‌ రేడియోతో తీరింది. ఈ ప్రోగ్రామ్‌ ప్రతి స్కూల్‌లో తప్పనిసరిగా పెడితే బాగుంటుంది. ... ఎం. మౌనిక, 5 వ తరగతి
మాట్లాడగలననే నమ్మకం నాలో కలిగింది ! స్కూల్‌ రేడియో కార్యక్రమం వలన తడబడకుండా చదవటం నేర్చుకున్నాను. పర్యావరణ విద్యను ఎలా అందించాలో నేర్చుకున్నాను. అందరి ముందూ మాట్లాడగలననే నమ్మకం నాలో కలిగింది. ఆడపిల్లలు ఎలా వుండాలి, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పారు. గాలి, నీరు దొరకకపోతే ఎటువంటి సమస్యలు కలుగుతాయో కూడా తెలియజేశారు.  - జి. ఇందు, 7వ తరగతి 

స్కూల్‌ రేడియో

టీ పెట్టటం ఎలాగో చెప్పమని, కమ్యూనికేషన్‌ నైపుణ్యాల గురించి తెలుసుకొనేలా చేశారు. హ్యూమన్‌ రైట్స్‌ టాపిక్‌ మాకు ఇచ్చారు. దానిలో టార్చర్‌ గురించి నేను మాట్లాడాను. నా వాయిస్‌ని రికార్డు చేయటం నాకు నచ్చింది.
జి.మైత్రి, 8వ తరగతి

ముందు భయపడ్డాను కానీ, స్కూల్‌ రేడియోలో మాట్లాడిన తర్వాత చాలా ఈజీగా అనిపించింది. మమ్మల్ని బాగా ఇన్‌స్పయిర్‌ చేశారు. మా స్కూల్‌ వాళ్లంతా చాలా యాక్టివ్‌గా పాల్గొన్నారు.
కె.హారిక

ఎలా వినాలో, ఏమి చేయాలో, ఏమి గ్రహించాలో స్కూల్‌ రేడియో వలన నేర్చుకొన్నాను. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు పూర్తిగా ఏకాగ్రత వుంచాలి. మనం జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కార్యక్రమం వలన తెలుసుకొన్నాను.
పి.హేమలత

పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకొన్నాను. భవిష్యత్తులో ఈ కార్యక్రమం మాకు బాగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం పెట్టకముందు నేను ఏదైనా మాట్లాడాలంటే ఎంతో భయంగా వుండేది. ఇపుడు నేను ధైర్యంగా అందరి ముందూ మాట్లాడగలను.
కె.లోహిత, 5వ తరగతి

స్టూడియోకి వెళ్ళి రేడియోలో ఎలా మాట్లాడాలో తెలుసుకొన్నాను. మేము వ్రాసిన స్క్రిప్ట్‌లో తప్పులను సరిదిద్ది, మమ్మల్ని ప్రోత్సహించారు.
బి.భారతి, 8వ తరగతి 

డిజిటల్‌ క్లాసులో వీడియోలు చూపించి, మమ్మల్ని ప్రశ్నలు అడిగారు. మమ్మల్ని అందరినీ మాట్లాడేలా చేశారు. ఎంతమంది డిస్ట్రబ్‌ చేసినా, పట్టించుకోకుండా, దేనిమీదైనా కాన్‌సన్‌ట్రేషన్‌ పెట్టటం ఎలాగో తెలుసుకొన్నాను.
పి. కుసుమ, 6వ తరగతి

స్కూల్‌ రేడియోలో మంచి కథలు నేర్చుకున్నాను. ఇక్కడ మేము ఒక టాపిక్‌ తీసుకొని, దాని గురించి అందరం చర్చించాము. మా వాయిస్‌ని రికార్డు చేశాం. మేము రికార్డు చేసిన దానిని వినిపించి, తప్పులు తెలియజేశారు. ఈ మూడు రోజులు చాలా సంతోషంగా ఉన్నాం.
ఎం.అనిత, 8వ తరగతి

స్కూల్‌ రేడియో కార్యక్రమం వలన నీటి కాలుష్యం, నీటి ప్రాధాన్యత గురించి నేను తెలుసుకొన్నాను. ఈ శిక్షణా కార్యక్రమం వలన నాలో వున్న భయం పోయింది. స్కూల్‌ రేడియో ద్వారా నేర్చుకున్న విషయాలు మనకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి.
ఎం.శరణ్య, 6వ తరగతి

స్కూల్‌ రేడియోలో కార్యక్రమాలు, అడిగిన ప్రశ్నలు నచ్చాయి. నాలో వున్న స్టేజీ ఫియర్‌ పోయింది. మమ్మల్ని గ్రూపులుగా చేసి, ఒక టాపిక్‌ ఇచ్చి, అవసరమైన పుస్తకాలు ఇచ్చి చర్చించమని చెప్పటం, రికార్డు చేయటం నాకు చాలా నచ్చింది.
లిఖిత, 7వ తరగతి

స్కూల్‌ రేడియో వలన ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి నాలో కలిగింది. వాతావరణ కాలుష్యం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. వీటి గురించి రేడియోలో మాట్లాడటం వలన నాలో భయం పోయింది.
సి.హెచ్‌. దాక్షిణ్య, 9వ తరగతి

స్కూల్‌ రేడియోతో పిల్లల్లో చైతన్యాన్ని నిరూపించడానికి తగిన సమయం లభించింది. మనం ఏదైనా చెప్పేటప్పుడు ధైర్యంగా, స్పష్టంగా మాట్లాడాలని రేడియో కార్యక్రమం వలన తెలుసుకొన్నాను. స్కూల్‌ రేడియో వలన ఎన్నో నినాదాలు తెలుసుకొన్నాను. వాతావరణాన్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకొన్నాను.
పి.హేమలత 

మా పాఠశాలలో స్కూల్‌ రేడియో మూడు రోజులు నిర్వహించారు. పాల్గొన్న 64 మందినీ గ్రూపులలో కూర్చోబెట్టి అనేక అంశాల మీద చర్చించేలా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఎన్నో విషయాలు నేర్చుకొన్నాను.
లిఖితాంజని, 9వ తరగతి

వ్రాయటం, చదవటం, మాట్లాడటం ఇవన్నీ నాకు నచ్చాయి. కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను. స్కూల్‌ రేడియోలో నేను ఇన్ఫెక్షన్ల గురించి మాట్లాడాను.
వి.సంధ్య, 8వ తరగతి

తప్పు చెప్తే, ఏమైనా అంటారేమోనని ముందు భయపడ్డాను. కాని మమ్మల్ని అన్నిరకాలుగా ప్రోత్సహించి, మాలో భయం పోగొట్టారు. స్కూల్‌ రేడియోకి కృతజ్ఞతలు.
పి. సాయి సంవర్షిణి

మీ గొంతుని రేడియోలో వినిపిస్తాం అని స్కూల్‌ రేడియో టీమ్‌ చెబితే, నాకు చాలా సంతోషం కలిగింది. స్కూల్‌ రేడియో నాకు ఆహ్లాదంగా, ఆనందంగా అనిపించింది. స్కూల్‌ రేడియో కోసం నేను ఒక కథ వ్రాస్తాను.
ఆర్‌.మోహిత, 8వ తరగతి

స్కూల్‌ రేడియో ప్రోగ్రాంలో పాల్గొనాలని తెలిసి, మొదట చాలా బోరింగ్‌గా ఫీల్‌ అయ్యాను. కాని తర్వాత చాలా ఆసక్తికరంగా పాల్గొన్నాను. ప్రోగ్రాం చాలా ఇంటరెస్టింగ్‌గా వుంది.
పి.బి. భార్గవి, 9వ తరగతి

మూడు రోజుల స్కూల్‌ రేడియో కార్యక్రమంలో యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేశాను. హ్యూమన్‌ రైట్స్‌ గురించి నేను ఈ కార్యక్రమంలో తెలుసుకున్నాను. మిగిలిన స్కూల్స్‌లో కూడ పిల్లల్లో చైతన్యాన్ని కలిగించాలని కోరుకొంటున్నాను.
సి.హెచ్‌.రేవతి, 9వ తరగతి

కొత్త విషయాల పట్ల నాలో ఆలోచనలను రేకెత్తించింది స్కూల్‌ రేడియో. దీనిలో నేను చెట్ల గురించి ఒక పాట పాడాను. ఈ కార్యక్రమం వలన నాలో జ్ఞాపక శక్తి పెరిగింది. భయం పోయింది.
ఆర్‌.నీక్షిత, 5వ తరగతి

స్కూల్‌ రేడియోకి నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా నాలో వున్న భయం పోయింది. ఇక నుంచి ధైర్యంగా ఏదైనా చెప్తాను. పాఠశాలలో జరిగే ఏ కార్యక్రమంలో అయినా పాల్గొంటాను.
ఎస్‌.నాగలక్ష్మి, 8వ తరగతి

స్కూల్‌ రేడియో క్లబ్‌ను మా పాఠశాలలో ప్రారంభించటం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ కార్యక్రమం వలన నాలో ఎంతో యాక్టివ్‌నెస్‌ వచ్చింది. వాయిస్‌ ఎలా రికార్డు చేయాలో మాకు నేర్పించారు. మాతో మూడు రోజులు గడిపి, మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు.
హర్షిత, 8వ తరగతి

స్కూల్‌ రేడియో వర్క్‌షాప్‌లో మేము ఎంత కాన్‌సన్‌ట్రేషన్‌తో చూస్తున్నామో అన్నది చెక్‌ చేయటానికి మాకు కొన్ని వీడియోలు చూపించారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పేందుకే అందరూ ప్రయత్నించారు కానీ, వీడియోలో జరుగుతున్న మార్పులను ఎవరూ గమనించలేదు. పరీక్షలలో వచ్చే ఇంపార్టెంట్‌ ప్రశ్నలకు టిక్‌ పెట్టుకుని జవాబులను చదువుతామే తప్ప పాఠం మొత్తం చదవం. అలా కాకుండా మొత్తం పాఠం చదివితే, పరీక్షల్లో ఏ ప్రశ్న అడిగినా సరే చెప్పగలమని దీని వలన తెలుసుకున్నాము. అలాగే భయపడుతూ కూర్చుంటే ఏమీ సాధించలేమని కూడ అర్థం చేసుకున్నాను.
డి.స్వాతి, 9వ తరగతి

నీటి వాడకం గురించి, గాలి కాలుష్యం గురించి, చెట్ల పెంపకం గురించి తెలుసుకున్నాను. ఎన్నో విషయాల పట్ల ఆసక్తి పెరిగింది.
ఎం.పూర్ణిమ, 9వ తరగతి

వినడం, మాట్లాడటం, గమనించటం అన్నీ స్పష్టంగా తెలుసుకున్నాను. స్కూల్‌ రేడియోకి కృతజ్ఞతలు.
ఎస్‌. అమ్మాజీ, 9వ తరగతి

మమ్మల్ని గ్రూపులుగా చేసి, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ గురించి మా అంతట మేమే తెలుసుకొనేలా చేశారు.
వై.విజయ, 8వ తరగతి

స్కూల్‌ రేడియో వలన దేనికైనా లేచి, నిలబడి జవాబు చెప్పే ధైర్యం మాలో వచ్చింది. ఇప్పటివరకు మాకు లేచి నిలబడి, మాట్లాడాలంటేనే భయం. మనం దేన్నైనా ముందు సరిగా వినాలి. వినడంలోనే మనం చాలావరకు నేర్చుకోవచ్చు అనేది కూడ దీని వలన మేము నేర్చుకున్నాము. అలాగే మనం ఏ విషయాన్నీ బట్టీ పట్టకూడదు. మనకు తెలిసిన రీతిలో, ఇతరులకు అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి అనేది కూడ తెలుసుకున్నాము.
జి.రోహిణి, 9వ తరగతి

నాకు మొదట్లో స్టేజ్‌ ఫియర్‌ ఉండేది. నేను అయిదవ తరగతిలో పాట పాడినప్పుడు ఎంతో భయపడ్డాను. ఎక్కడ తప్పు పాడతానో, ఎక్కడ ఏది మరిచిపోతానో అనిపించేది. స్పీచ్‌ చెప్పాలని ముందుకు వెళ్ళినా, ఏదో ఒక్కటి మర్చిపోయేదానిని. ఇప్పుడు స్కూల్‌ రేడియో ప్రోగ్రాం వలన నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను.
ఎం.అనూష, 7వ తరగతి

నేను స్క్రిప్ట్‌ వ్రాయటం, మైక్‌ ముందు మాట్లాడటం నేర్చుకున్నాను. నాలో కాన్‌సన్‌ట్రేషన్‌ పెరిగింది.
ఎం.వనజ, 8వ తరగతి

నాకు స్కూల్‌ రేడియో నచ్చింది. నేను ఇలా ఎప్పుడూ, ఏ ప్రోగ్రామ్‌లో కూడ స్పీచ్‌ ఇవ్వలేదు. స్కూల్‌ రేడియో వలన నాకు సంతోషంగా వుంది. నేను బాగా స్పీచ్‌ ఇవ్వగలను అనే నమ్మకం కలిగింది. ఇప్పటి నుంచి ధైర్యంగా ఏ ప్రోగ్రామ్‌లో అయినా స్పీచ్‌ ఇస్తాను. మమ్మల్ని ఆరు గ్రూపులుగా చేసి, టాపిక్‌లను ఇచ్చారు. మేము అంతా కలిసి టీమ్‌లలో పనిచేయటం నేర్చుకున్నాం.
ఎస్‌.మేఘన, 9వ తరగతి

స్కూల్‌ రేడియో ప్రోగ్రాంలో మేము మాట్లాడిన మాటలను రికార్డు చేసి, వెబ్‌సైట్‌లో పెడతారు. అది విని మా పేరెంట్స్‌ సంతోషపడతారు. మళ్ళీ స్కూల్‌ రేడియో కార్యక్రమాలను మా స్కూల్‌ లో పెట్టాలని కోరుతున్నాను.
ఎస్‌.దుర్గా భవాని, 9వ తరగతి

స్కూల్‌ రేడియో పిల్లల కోసం అని అర్థం అయింది. మమ్మల్ని గ్రూపులుగా చేసి, పిల్లలకు వెరైటీ పుస్తకాలు ఇచ్చారు. ఆ పుస్తకాలను చదివి, మేము స్వంతంగా స్క్రిప్ట్‌ తయారుచేశాము. దానిని చూసి మా మాటలు రికార్డు చేశాము. దీని వలన మేము కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాము.
జి.ఐశ్వర్య, 8వ తరగతి


కమ్యూనికేషన్‌లో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన అయిదు డబ్ల్యూలు, ఒక హెచ్‌ గురించి తెలుసుకున్నాను. మాకు కొన్ని కథలు నేర్పించారు. పరిసరాల పరిశుభ్రత గురించి నేర్చుకున్నాము.
ఎ. విజయ, 7వ తరగతి

ఈ కార్యక్రమం వలన అందరితో కలిసిమెలిసి పనిచేయటం తెలిసింది. చాలా ధైర్యం కలిగింది.
ఎస్‌.జోషిత, 7వ తరగతి

  • స్కూల్‌ రేడియో వలన స్టేజ్‌ ఫియర్‌ పోతుంది. పెద్దయ్యాక మనం ఎన్నో ఇంటర్వ్యూలలో ధైర్యంగా జవాబు చెప్పగలుగుతాము. స్కూల్‌ రేడియో పిల్లలకు చదువుల పట్ల శ్రద్ధ పెంచి మంచివారిగా తీర్చిదిద్దుతుంది. ఈ ప్రోగ్రాం మా పాఠశాలలో మూడు రోజులు జరిగింది. అసలు అంత త్వరగా ఎలా గడిచిందో కూడా తెలియలేదు. నేను చాలా నేర్చుకున్నాను. ... కె.అలేఖ్య, 9వ తరగతి 
  • పర్యావరణాన్ని కాపాడాలని, వృధా చేయకూడదని ఈ స్కూల్‌ రేడియో మాకు నేర్పింది. - బి. రాధిక, 6వ తరగతి 
  • భయం వలన ఇంతకుముందు ఇటువంటి ప్రోగ్రాంలలో పాల్గొనలేదు. కాని స్కూల్‌ రేడియో వలన నాలో ధైర్యం పెరిగింది. ఇప్పుడు స్టేజ్‌ ఫియర్‌ లేదు. ఆనందంగా కూడ వుంది. - కె. శ్రీవల్లి, 7వ తరగతి 
  • మేము మాట్లాడేవి, వ్రాసేవి ఇంటర్నెట్‌లో వుంచటం మాకు ఆనందం కలిగిస్తోంది. స్కూల్‌ రేడియోకి ధన్యవాదాలు. .. పి. రేష్మ, 7వ తరగతి 
  • పర్యావరణ పరిరక్షణ, గ్రంథాలయాల గురించి ఈ స్కూల్‌ రేడియో కార్యక్రమంలో తెలుసుకున్నాను. ... పి. సుజాత, 6వ తరగతి 
  • రేడియో గురించి, రేడియోలో మాట్లాడటం గురించి నేర్చుకున్నాను. ... వై. ఝాన్సీ, 6వ తరగతి 
  • స్కూల్‌ రేడియో మనకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. పిల్లల్లో భయాన్ని పోగొట్టే లక్ష్యంతో స్కూల్‌ రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒకరు ఎప్పుడైనా, ఏదైనా చెప్పేటప్పుడు వినాలి. ఆ తరువాత వాళ్ళు చెప్పింది ఏమిటో అర్థం చేసుకుని, ఆ పని ఏమిటో చేయాలి. అంతేకానీ ఒకరు చెప్పినప్పుడు వినకుండా, మన పని మనం చేసుకుపోతే ప్రయోజనం ఉండదు కదా! ఇది కూడ మేము స్కూల్‌ రేడియో యాక్టివిటీలో తెలుసుకున్నాం. ... పి. లక్ష్మీ శారద, 5వ తరగతి 
  • స్కూల్‌ రేడియో వలన మేము స్వంతంగా వ్రాయటం, మాట్లాడటం నేర్చుకున్నాం. అందరి ముందు భయం లేకుండా మాట్లాడగలుగుతున్నాను. ... వై. లహరి, 6వ తరగతి 
  • నాకు మైక్‌లో మాట్లాడాలంటే ఎంతో భయం. కాని మూడు రోజుల స్కూల్‌ రేడియో ప్రోగ్రాంలో పాల్గొనటం వలన అందరి ముందు మాట్లాడగలుగుతున్నాను. ... బి. రమ్య ప్రియ, 8వ తరగతి 
  • మూడు రోజుల స్కూల్‌ రేడియో కార్యక్రమంలో చక్కగా అర్థం అయ్యే రీతిలో చాలా బాగా చెప్పారు. వారు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. స్కూల్‌ రేడియో వలన పిల్లల భావాలను, వారి అనుభవాలను గురించి తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతోందో కూడా తెలుసుకోవచ్చు. ... ఎ.శ్రావణి, 9వ తరగతి 
  • స్కూల్‌ రేడియోలో ఎన్నో విషయాలు ఆనందంగా నేర్చుకున్నాను. ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పగలననే నమ్మకం పెరిగింది. ... ఎ. రాజేశ్వరి, 6వ తరగతి 
  • మనకు ఏదైనా టాస్క్‌ ఇచ్చినప్పుడు, కేవలం దానిమీదనే కాకుండా చుట్టూ వున్న వాటి మీద కూడ దృష్టి నిలపాలని స్కూల్‌ రేడియో వలన తెలుసుకున్నాను. ... ఓ. లత, 9వ తరగతి 
  • స్కూల్‌ రేడియో వలన గ్రంథాలయాలు, పర్యావరణం గురించి తెలుసుకున్నాను.  ... డి. నందిని, 6వ తరగతి 

© Copyright 2015 School Radio - All Rights Reserved